Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి

శాయంపేట మండల కేంద్రంలో గ్రామపంచాయతీ పరిధిలోని భారతీయ జనతా పార్టీ బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయుని చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు .తదనంతరం దీన్ దయాల్ ఉపాధ్యాయ నీ స్మరించుకుంటూ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జీవిత సారాన్ని గుర్తు చేశారు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జనసంఘ స్థాపకులలో ఒకరు. ఆయన జీవితం ఏకత్వం, మానవతా భావన, అంత్యోదయ సిద్ధాంతాల స్పష్టమైన ప్రతీక. విద్యార్థులు, యువత , ప్రజల జీవితాలను మార్గదర్శకంగా మార్చిన ఆయన సిద్ధాంతాలు, సూత్రాలు ప్రస్తుత సమాజానికి స్ఫూర్తి ఇస్తాయని వారు కొనియాడారు.పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ విద్యారంగంలో చేసిన సేవలు, సామాజిక సదుపాయాల పట్ల ఆయన ఇచ్చిన దృష్టి, మానవతా సూత్రాలపట్ల ఆయన ప్రతిబద్ధతపై ప్రత్యేకంగా స్పష్టంగా చెప్పారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆలోచనలు, సమాజంలోని అసమానతల నివారణకు మార్గం, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం వంటి విలువలను ప్రతిబింబిస్తాయని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి భూతం తిరుపతి, యువర్ మోర్చా జిల్లా నాయకులు కొత్తపల్లి శ్రీకాంత్, మండల ఉపాధ్యక్షుడు కోమటి రాజశేఖర్, భూత్ అధ్యక్షులు బాసాని నవీన్ ,గొండ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు…..