Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 26 నడిగూడెం

ప్రతి విద్యార్థి నిత్యం కళాశాల హాజరై ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకునేందుకు తల్లిదండ్రులు సహకరించాలని నడిగూడెం కే ఎల్ ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డి విజయ నాయక్ పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు శుక్రవారం కళాశాల ఆవరణలో నిర్వహించిన పేరెంట్స్ టీచర్ సమావేశంలో అధ్యక్షత వహించి మాట్లాడారు కళాశాలలో ఉన్న వసతులు బోధన బోధనేతర సిబ్బంది అర్హత విద్యార్థులకు నిత్యం నిర్వహిస్తున్నటువంటి తరగతులు పోటీ పరీక్షలు సంసిద్ధత కళాశాలలో విద్యార్థుల నమోదు ఏడాది సాధించిన ఉత్తీర్ణతను సమావేశంలో వివరించారు. కళాశాలకు సంబంధించిన వివరాలను అధ్యాపకులు జాన్ పాషా శ్రీధర్ మహేష్ కృష్ణ ఈశ్వర్ కొల్లు శ్రీనివాస్ డి శ్రీనివాసరావు ఆర్ సుజాత సమావేశంలో వివరించారు. ఈ కళాశాలలో విద్యనభ్యసించి పలు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన పూర్వ విద్యార్థులు సమావేశంలో మాట్లాడారు వారిని కళాశాల పక్షాన సత్కరించడం జరిగింది. కళాశాల అధ్యాపకులు నాగరాజు ఉపేందర్ వెంకటేశ్వరరావు రజిత తేజశ్రీ రవివర్మ కాటమరాజు వీరన్న మధర్ ధనుంజయ నగేష్ హేమలత నాగరాణి శైలజ మనీ బి సుజాత వెంకటేశ్వర్లు నాగరాజు పాల్గొన్నారు