జనం న్యూస్ సెప్టెంబర్ 26 సంగారెడ్డి జిల్లా
ముఖ్య కార్యకర్తల సమావేశం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జరిగింది. ఈ సందర్భంగా అక్టోబర్ 6వ తేదీ నుండి నవంబర్ 6వ తేదీ వరకు జిల్లా కలెక్టరేట్ వద్ద, మండల తహసీల్దార్ కార్యాలయాల వద్ద మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి, వహాబ్ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్షలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి, మహాజన సామాజికవాద పార్టీ నాయకులకు బాధ్యతలు కేటాయించారు. పటాన్ చేరు మండలానికి చెందిన బండ రాజు మాదిగను మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి సంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా, క్యాసరం నటరాజ్ మాదిగను మహాజన సామాజికవాద పార్టీ సంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధిగా, కొంగరి కృష్ణ మాదిగను జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్‌లు వి.ఎస్.రాజు, రామరాపు శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు మైసగాళ్ల బుచ్చేంద్ర, రాష్ట్ర నాయకురాలు పెద్ద గీత మాదిగ, పటాన్చెరు నియోజకవర్గ ఇంచార్జి ఫొటోళ్ల వెంకటేష్ మాదిగ పాల్గొన్నారు.


