Listen to this article

వాగు దాటే ప్రయత్నం చేయవద్దు. మంచన్ పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజ్.

జనం న్యూస్ 26 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా.

వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మంచన్ పల్లి వాగు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాగు ఉధృతంగా పొంగి ప్రవహిస్తుంది. ఈ వాగు ఉద్ధృతి కారణంగా అటు పరిగి నుంచి రంగపూర్, మాదారం మంచన్ పల్లి, గట్టుపల్లి, నిజాంపేట్ మేడిపల్లి, గ్రామాలకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచన్ పల్లి నుంచి పరిగి వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడ్డారు. జోరుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులన్నీ జల మయమయ్యాయి. దీంతో వాహనదారులు రాకపోకలకు ఆటంకాలు కలిగాయి. మంచన్ పల్లి వాగు దగ్గర గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజ్, కారోబార్ శ్రీను, పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్ అడ్డుపెట్టి ఎవరిని వాగు దాటనివ్వకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. వాగు దాటే సాహసం చేయవద్దని, నీటి ప్రవాహం తగ్గిన తర్వాతే ప్రయాణం కొనసాగించాలని అధికారులు, పోలీసులు ప్రజలకు హెచ్చరించారు.