జనం న్యూస్ సెప్టెంబర్ 26. వికారాబాద్ జిల్లా
పరిగి నియోజకవర్గంలోని దోమ మండలం పరిధిలో కొండాయపల్లి గ్రామంలో ఈనెల 28వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను విడుదల చేసిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతిగారి సురేందర్ కుమార్, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, జేఏసీ వెంకటయ్య, అంబేద్కర్ విజ్ఞాన వేదిక సంఘం నాయకులు మంచన్పల్లి శ్రీనివాస్, తుప్పల అశోక్, పోరాటాల రామన్న, జేఏసీ రవికుమార్, నాగేశ్వర్, మల్లేశం,తదితరులు పాల్గొన్నారు.


