Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు సెప్టెంబర్ 27, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన ప్రఖ్యాత శివ క్షేత్రం శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బోర్డు చైర్మన్ పోతు గుంట రమేష్ నాయుడుని శుక్రవారం అందరూ బిజెపి నాయకులు లైన్స్ క్లబ్ మిత్రులతో కలిసి రమేష్ నాయుడుని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ సందర్భంగా లయన్ మన్నెం రామ్మోహన్ మాట్లాడుతూ మృదుస్వభావి హిందూ ధర్మ పరిరక్షణ కొరకు నిరంతరం తపించే పోతు గుంట రమేష్ నాయుడు కు చైర్మన్ పదవి దక్కడం ఆనందంగా ఉందని తెలిపారు, అనంతరం రాజంపేట బిజెపి పార్లమెంట్ ఇంచార్జ్ సాయి లోకేష్ ని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ కార్యక్రమంలో ఉప్పు శెట్టిసుధీర్ కోడూరు ఆదినారాయణ వంటి మారయ్య దాసరి వెంకటరమణ బండారు రెడ్డి శేఖర్ తెలుగు యువత కంపరాజు సాయి తదితరులు పాల్గొన్నారు,.