Listen to this article

పాల్గొన్న జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య

జనం న్యూస్ సెప్టెంబర్ 26 సంగారెడ్డి జిల్లా

గడ్డపోతారం మున్సిపాలిటీ వావిలాలలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకట్రామయ్య, జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, మేనేజర్ మధుసూదన్ ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఐలమ్మ చేసిన తెలంగాణ సాయుధ ఉద్యమంలో ఆమె పోరాటాన్ని స్మరించారు. మహిళలకు సమాన హక్కులు, గౌరవం సాధించేందుకు ఐలమ్మ చేసిన త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని యువత పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, మాజీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.