Listen to this article

నేదునూరు లో వైద్య శిబిరాన్ని సందర్శించిన బీజేపీ నేతలు

జనం న్యూస్ సెప్టెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ పి.గన్నవరం నియోజకవర్గం

అయినవిల్లి మండలం నేదునూరు గ్రామ పంచాయితీ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా అయినవిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యాధికారి డాక్టర్ మంగాదేవి, డాక్టర్ సంతోష్ నేతృత్వంలో గ్రామ సర్పంచ్ గుమ్మడి ప్రసాద్ అధ్యక్షతన స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ లో భాగంగా సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ముఖ్యఅతిథిగా ఇంచార్జి ఎంపీడీవో వాణీ కుమారి పాల్గొన్నారు. ఈ శిబిరాన్ని అయినవిల్లి మండల బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు సందర్శించారు. మొదటగా వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు, సేవా పక్వాడ జిల్లా కో కన్వీనర్ గనిశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ ఈ వైద్య శిబిరాలు లో మహిళలకు క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఈ వైద్య శిబిరాలు మహిళలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వెంకటరమణ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గించి పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం ఇచ్చారన్నారు. విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారని అన్నారు. అనంతరం అంగన్వాడి సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాల్ ను పరిశీలించి వారు చేసిన పౌష్టికాహార పిండి వంటలు రుచి చూశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఇండుగుల వెంకటరామయ్య, మాజీ జడ్పీటీసీ గుమ్మడి వెంకటేశ్వరరావు, ఎం.ఎల్.హెచ్.పీ సుగుణ, పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.