జనం న్యూస్ సెప్టెంబర్ 27 శాయంపేట మండలం
స్థానికంగా రాబోయే ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పిటిసి గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎన్నికలలో విధులను నిర్వహించే రిటైరింగ్ అధికారులు ప్రెసైంటింగ్ అధికారులకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు మండల కేంద్రంలోని ఎస్వీ కేకే ఫంక్షన్ హాల్ లో స్థానిక ఎంపీడీవో పణి చంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎల్ పిఓ రవిబాబు పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పాల్గొనే అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఎన్నికలను సమర్ధతవతంగా నిర్వహించాలని తెలియజేశారు ఎన్నికలను సజావుగా నిర్వహించి న్యాయబద్ధంగా జరిగేలా చూడటం మన అందరి బాధ్యత అని తెలిపారు ఎన్నికల ప్రక్రియ ప్రతి అధికారి కర్తవ్యం గా భావించి చట్టబద్ధత తో నిర్వహించాలని సూచించారు శిక్షణ ద్వారా పాటించవలసిన ఎన్నికలలో నిర్వహించిన బాధ్యతలు ఖచ్చితంగా పాటించడం వల్ల ఎలాంటి తప్పిదాలు జరగవు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు ఎన్నికలు జరిగేటప్పుడు పక్షపాతంగా పారదర్శకంగా జరిగేలా చూడటం ప్రతి అధికారి బాధ్యత అని అన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడటానికి ప్రతి అధికారి కృషి అవసరమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ బిక్షపతి ఎంపీఓ రంజిత్ కుమార్ ఎంపీడీవో కార్యాలయ సిబ్బందిలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు….


