జనం న్యూస్ సెప్టెంబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా అమలాపురం పార్లమెంట్ అల్లవరం మండల కేంద్రం వద్ద టిడిపి మండల అధ్యక్షుడు క్షత్రియ పరిషత్ రాష్ట్ర డైరెక్టర్ దెందుకూరు సత్తిబాబు రాజు అధ్యక్షతన నరేంద్ర మోడీ వారి పుట్టినరోజు వేడుకలు..సేవా పక్వాడ్ కార్యక్రమాలు..11వ రోజు సేవా కార్యక్రమాలు జరిగినవి ఈరోజు అల్లవరం గ్రామంలో మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. యొక్క క్యాంపుల్లో మెడికల్ డాక్టర్స్ సిబ్బంది వారి సహకారం అందిస్తూ ఓపి రాయించుకున్న వారికి టెస్టులు చేయించి మందులు ఇస్తున్నారు. అంగన్వాడి కేంద్రం వారు కూడా ఈ యొక్క క్యాంపుల్లో పాల్గొని పోషక ఆహారం అనేకరకాలవంటకాల డెమో ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి పూర్వ అధ్యక్షులు యాళ్ల దొరబాబు జడ్పిటిసి గౌతమి పాల్గొన్నారు యా ళ్ల దొరబాబు మాట్లాడుతూ నరేంద్ర మోడీ చేసిన సేవలను కొనియాడారు జీఎస్టీ తగ్గించడం వల్ల పేద ప్రజలకు చాలా ఉపయోగమని ఆయన అన్నారు ఈయొక్కగవర్నమెంట్ మెడికల్ క్యాంపులు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ ఇస్తున్న అనేక పథకాల గురించి వివరిస్తూ ప్రతి ఒక్కరూ ఈ పథకాలను ఉపయోగించుకోవాలని యాళ్ల దొరబాబు అన్నారు. ఈ మెడికల్ క్యాంపులో ఎంపీపీ ఇళ్ల శేషారావు సుంకర సాయి కట్ట నారాయణమూర్తి గుత్తుల పుల్లయ్య శెట్టి రేకాడి వర్మ మరియు డాక్టర్లు స్టాప్ కూటమికి చెందిన నాయకులు పాల్గొన్నారు


