జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
రోడ్డు పనులను దగ్గరుండి పరిశీలిస్తున్న టిడిపి నాయకులు
నందలూరు మండలం టంగుటూరు ఓబిలి మధ్య ఉన్న రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలు కారణంగా పింఛ డ్యాం నిండి గేట్లు తెరవడంతో చెయ్యరు నది ఉప్పొంగి వరద నీటిలో టంగుటూరు ఓబిలి రహదారి కొట్టుకపోయినది.ఈ విషయం తెలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ్ శేఖర్ రెడ్డి మరియు నందలూరు మండల మాజీ ఎంపీపీ భువన బోయిన లక్ష్మీనరసయ్య స్పందించి వారి ఆధ్వర్యంలో రోడ్డు పునర్ధన పనులు చేయించడంజరిగినది.నందలూరు మండల ప్రజలకు మరియు పెనుగులూరు మండల ప్రజలకు అనుసంధానంగా ఉండే ఈ రోడ్డును మరమ్మత్తలు చేయడంతో స్థానిక ప్రజలు మేడా విజయ శేఖర్ రెడ్డి ను భువన బోయిన లక్ష్మీ నరసయ్యను తెలుగుదేశం పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టంగుటూరు ఎంపీటీసీ భువనబోయిన పెంచలయ్య,చుక్క వెంకటేశ్వరయ్య,టంగుటూరు సర్పంచ్ మైనుద్దీన్,మాజీ ఎంపీటీసీ అక్బర్ ఖాన్,మాజీ నీటి సంఘం అధ్యక్షుడు అల్లా బకాష్,టిడిపి నాయకులు గుజ్జుల ఈశ్వరయ్య,టిడిపి మహిళా నాయకురాలు షేక్ షర్మిల,తోకల వెంకటరమణ,అరవింద్ బాబు, ఈశ్వరయ్య,కడప శ్రీనివాసులు, కడప చంద్ర,టంగుటూరు నాసిర్, టంగుటూరు చింత కాయలపల్లి మదన్ మోహనపురం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



