Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 29 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం సందర్భంగా ఉదయం 10 గంటలకు విద్యార్థులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం లీలావతి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ లావు సుష్మా గారి ఆర్థిక సహాయ సహకారాలతో విద్యార్థులకు ఉచితంగా పెన్నులు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సరస్వతీదేవి అమ్మవారి స్తోత్ర పారాయణ చేసి ట్రస్టు నిర్వాహకులు పూసపాటి బాలాజీ మాట్లాడుతూ గత 11 సంవత్సరములుగా మూలా నక్షత్రం సందర్భంగా విద్యార్థులకు ఉచిత పుస్తకములు పెన్నులు పంపిణీ చేస్తున్నామని అమ్మవారి పూజ నిర్వహించి నా వస్తు సామాగ్రి విద్యార్థులకు సమర్పించడం వల్ల వారికి విద్యా ఆటంకాలు తొలగి బాలారిష్ట దోషాలు తోలుగుతాయని తెలియజేశారు, అంతేగాకుండా సద్గురు సన్నిధిలో అమ్మవారి శక్తి మరింత వృద్ధి చెంది అనుగ్రహం కలుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా భక్తులతో పాటు ఆర్యవైశ్య ప్రముఖులు అయినవోలు హనుమంతరావు పాల్గొన్నారు