Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 29 శాయంపేట మండలం

మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ పండుగ విషయం గ్రామ కార్యదర్శి రత్నాకర్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు జిన్న ప్రతాప్ సేనా రెడ్డి. మత్స్యగిరి దేవస్థానం ఆలయ చైర్మన్ సామల బిక్షపతి. అన్ని కుల సంఘాల పెద్దలు కలసి చర్చించుకోవడం జరిగింది సద్దుల బతుకమ్మ ప్రభుత్వనిర్ణయ ప్రకారం మంగళవారం రోజున సద్దుల బతుకమ్మ జరుపబడును అని నిర్ణయం చేయడమైనది దీనికి గ్రామ ప్రజలు అందరూ సహకరించి మంగళవారం సద్దుల బతుకమ్మ చేసుకోవాల్సిందిగా అందరి సమక్షంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వంగరి సాంబయ్య, చిందం రవి, బాసాని ప్రకాష్, గిద్దెమరి సురేష్ ,నడిగోట్టు సాంబయ్య, బాసాని నవీన్, మామిడి ప్రమోద్, మోరె రంజిత్, లోకలబోయిన కుమారస్వామి, నడిగొట్టు అశోక్, నడిగోట్టు అరవింద్, పున్నం అఖిల్ తదితరులు పాల్గొన్నారు…..