జనం న్యూస్, సెప్టెంబర్ 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ విజయదశమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు దేశ సేవలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ సందర్భంగా ఆర్ ఎస్ ఎస్ ప్రముఖులు మాట్లాడుతూ దేశ సేవ చేయడంలో ఆర్ఎస్ఎస్ ముందుంటుందని, భారతావని ప్రజలు సంతోషంగా ఉండాలని ఉద్దేశంతో గత 100 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ ఆర్ఎస్ఎస్ ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని సమాజ సేవ చేయడంలో ముందుంటుందని, హిందూ ధర్మం కాపాడడంలో ఆర్ఎస్ఎస్ అగ్రభాగాన నిలుస్తుందని గ్రామీణ ప్రాంతాల్లోకి ఆర్ఎస్ఎస్ వెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని , అక్టోబర్ 4 న గజ్వేల్ లో నిర్వహించే పద సంచాలన ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు


