Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 29 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కందికుప్ప సహకార సంఘ సమావేశం సంఘ చైర్ పర్సన్ నూకల వి వి ఎస్ ఎన్ వి ప్రసాద్ ( మూర్తి) అధ్యక్షతన సోమవారంజరిగింది. సంఘం వాయిదా మీరిన బకాయిలు చెల్లించి, సంఘ అభివృద్ధికి సహరించాలి అని విజ్ఞప్తి చేశారు. సంఘ గోడౌన్ నిర్మించడానికి డిసిసిబి చైర్ పర్సన్ తుమ్మల రామస్వామి ( బాబు) ను కోరతామని చెప్పారు. సంఘం లో డిపాజిట్లు చేయాలని సభ్యులని కోరారు. సీఈఓ యర్రంశెట్టి రామచంద్రరావు సంఘ ప్రగతి వివరించారు. పర్సన్లు కాలాడి వీరబాబు, బొంతు శివకుమార్, సభ్యులు నూకల కొండలరావు, దాసరి బాబురావు, మరియు సంఘ సిబ్బంది పాల్గొన్నారు