జనంన్యూస్. 29.సిరికొండ.ప్రతినిధి.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రూరల్ సిరికొండ మండలం లోని నారాయణ పల్లి గ్రామం లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఊరి మధ్య హనుమాన్ టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఉల్లాసంగా ఉత్సాహంగా కేరింతలతో సంబరాలు జరుపుకుంటున్నారు. సంవత్సరంలో ఒకసారి మహిళలంతా ఒకే దగ్గరికి చేరి జరుపుకునే తెలంగాణలోని అతిపెద్ద సంబరంలో ఇది ఒకటి బతుకమ్మ సంబరాలు. పల్లెలు పట్టణాలు తెలంగాణ వ్యాప్తంగా సంబరాలలో మునిగితేలుతున్నాయి.



