Listen to this article

జనం న్యూస్ 30 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా.

వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మంచన్ పల్లి లో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తంగేడు, గునుగు, గుమ్మడి, బంతి, చామంతి, సీతమ్మ జడ, బీర, రుద్రాక్ష పువ్వులతో బతుకమ్మను తయారుచేస్తారు. రంగురంగుల పూలను తెచ్చి బతుకమ్మను పేర్చి పూజించారు. అనంతరం ఆడపడుచులు ఆటపాటలతో అలరించారు. చిన్నారులు, పెద్దలు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఊరేగింపుగా బయలుదేరి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మల్లేశం, వీరేశం AMC, సత్యనారాయణ రెడ్డి, శివరాం రెడ్డి, ఈశ్వరయ్య, కిష్టారెడ్డి, రవి, రమేష్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.