Listen to this article

సిద్దిపేట, సెప్టెంబర్ 29(జనం న్యూస్ చంటి)

సిద్దిపేట: ఆదర్శనగర్ వీధి నెంబర్ 4 లో ఘనంగా బతుకమ్మ పండగ ను రంగు రంగు పూలతో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ ఒక లయతో అడుగులు వేస్తూ బతుకమ్మ పాటలను పాడుకుంటూ బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపూవుల బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఇలా తొమ్మిది రోజులపాటు కొనసాగించే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు అలాగే బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల అని ఆటపాటల్లో మహిళల తమ కష్టసుఖాలను ప్రేమ స్నేహం బంధుత్వం ఆప్యాయతలు భక్తి భయం అన్నిటిని కలిపి తమ బాధలను కష్టాలను సుఖలను తమ పాట ద్వారా సోదరి మనులు తమ అమ్మ అన్నలను తమ్ములను పాట రూపంలో గుర్తు చేస్కుంటూపండగ అంగరంగ వైభావంగ జరుపుకున్నారు ఈయొక్క పండుగ కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరు జరుపుకోవడం జరిగింది.