,సెప్టెంబర్29 (జనంన్యూస్)
పాపన్న పేట మండల పరిధిలోని లింగాయిపల్లి గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం రోజు మహిళలు కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా మహిళలు,భక్తులు ఉదయం నుండే అమ్మవారి మంటపానికి తరలి వచ్చి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం నాయకులు కొత్త విషాంత్ గుప్తా,పాపన్న పేట మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్త వెంకటేశం గుప్తా, మాజీ సర్పంచ్ నవీన్ గౌడ్,సిద్దిరాములు,మల్లేశం, బంజ కరునప్ప,మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


