Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 29 రిపోర్టర్ సలికినిడి నాగరాజు

తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ను బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డిజిపి ద్వారకా తిరుమలరావు ఆవిష్కరించారు. అనంతరం తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం క్యాలెండర్ డైరీ ను ఆవిష్కరించటం సంతోషంగా ఉందంటూ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. డైరీ క్యాలెండర్ ఆవిష్కరించిన సందర్భంగా డిజిపి ద్వారకా తిరుమలరావు కు తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం తరపున వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యులు కోయ రామారావు, కె.వి నారాయణ, బోడపాటి సుబ్బారావు, బింగి సత్యం, శివశంకర్, సాంబశివరావు పాల్గొన్నారు