జనం న్యూస్ సెప్టెంబర్ 30 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
శరన్న నవరాత్రుల్లో భాగంగా సరస్వతీ దేవి మూల నక్షత్రం సందర్భంగా శ్రీశ్రీశ్రీ భోగలింగేశ్వర దేవస్థానంలో సరస్వతీ దేవి అలంకరణలో దేవస్థానంలో ఏర్పాటుచేసిన స్కూలు విద్యార్థి విద్యార్థులు 120 మంది పాల్గొన్న కార్యక్రమంలో పిల్లలకు సరస్వతీ పూజలు అక్షర అభ్యాసాలు, ముత్తైదువులకు కుంకుమార్చన అర్చకులు పేరూరి చిన్ని స్వామి పేరూరు సాత్విక్ షాడ శేష్ కుమార్ పండితులచే నిర్వహించబడినదని దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ తెలియజేశారు. సరస్వతీ పూజలో పాల్గొన్న పిల్లలకు పలకలు పుస్తకాలు పెన్సిల్లు పెన్నులు, బిస్కెట్లు శీతల పానీయాలు అమ్మవారి ప్రసాదం వితరణ చేశారు. చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లలకు విద్యాబోధనతోపాటు క్రమశిక్షణ సంస్కారాన్ని చిన్నప్పటినుండి అలవాటు చేయాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి బంగార్రాజు కాండ్రేగుల వెంకట సూరిబాబు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి వారి భక్తులు బుద్ధ మురళి తాతారావు పది కుర్చీలు పది స్టూల్స్ దేవస్థానానికి బహుకరించినందుకు దేవస్థానం తరపున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు.//


