జనం న్యూస్, సెప్టెంబర్ 30, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నర్సన్నపేట గ్రామానికి చెందిన ఎస్సీ సీనియర్ నాయకుడు గిల్క బాల్ నరసయ్య,అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ దుర్గామాత కరుణాకటాక్షాలతో అందరూ బాగుండాలని, నరసన్నపేట గ్రామానికి సర్పంచ్ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ రావడం సంతోషంగా ఉందని, గ్రామ సేవ చేయడానికి నాకు ప్రజలు అవకాశం కల్పిస్తే, సర్పంచ్ గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతూ అందరితో కలిసి, గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తెచ్చే విధంగా సాయశక్తుల కృషి చేస్తానని అందరూ నాపై దయవుంచి నాకు సహకరించాలని కోరడం జరిగింది.


