జనం న్యూస్ సెప్టెంబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బాకీ పడ్డ కాంగ్రెస్ బాకీ కార్డు ను మాజీ ఎమ్మెల్యే గండ్ర విడుదల చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.రానున్న స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని.కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలి అని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలల్లో అన్ని వర్గాల ప్రజలకు ఎంత బాకీ పడ్డదో కాంగ్రెస్ బాకీ కార్డు ద్వారా ప్రజలకు తెలియచేసి ఓటు కోసం మీ ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీసి అడిగేలా వారిని చైతన్యవంతులను చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో శాయంపేట మండలం మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి మాజీ సర్పంచ్ వల్పదాసు చంద్రమౌళి మారపెల్లి నందం ఉపసర్పంచ్ సుమన్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మనోహర్ రెడ్డి పీఎసిఎస్ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతిరెడ్డి మండలంలోని వివిధ గ్రామాల గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు…..


