Listen to this article

జనం న్యూస్- సెప్టెంబర్ 30 – నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ మెయిన్ బజార్ లో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రులను పురస్కరించుకుని మహా అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి పూజలు చేసి అనంతరం అన్నసంతర్పణ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శీను నాయక్ మాట్లాడుతూ ఫ్రెండ్స్ యూత్ సభ్యులైనటువంటి షేక్ కాశీం సోదరులను అభినందించారు. కులమతాలకతీతంగా భారతీయ సాంప్రదాయాలను గౌరవిస్తూ గణేష్ నవరాత్రులతో పాటుగా, దేవి నవరాత్రులను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుండటం ఎంతో గర్వకారణం అని ఆయన అన్నారు. సీఐ శీను నాయక్ ను ఫ్రెండ్స్ యూత్ సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ సభ్యులు షేక్ ఖాసిం, చంద్రశేఖర్, తేజ ,శివ,నాగూర్, ప్రవీణ్, మురళి, ఫిరోజ్, దుర్గ, కార్తీక్ ,నాని, రాము, నితిన్, ఖాసీం, తదితరులు పాల్గొన్నారు.