Listen to this article

జనం న్యూస్, అక్టోబర్ 1 ( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) :

తెలుగు సాహిత్య అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని దాడి చంద్రశేఖరరావు, దోర్భల ప్రభాకర శర్మ, జానా దుర్గా మల్లికార్జున రావు, డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పి. లక్ష్మీ వాడకు చెందిన వర్ధమాన కవి ఎలిపే మధు రచించిన మధుర శతకం పుస్తకావిష్కరణ కార్యక్రమం కాట్రేనికోన గ్రంధి నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో కొల్లు రమణ పౌండేషన్ అధ్యక్షుడు కొల్లు ఆనంద్ ఆధ్వర్యంలో పద్య కోకిల సినారా అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. పద్యమంటే పారిపోయే యువత ఉన్న నేటి సమాజంలో పద్యాన్ని ఆయుధంగా చేసుకుని ఎన్నో అంశాలపై పద్యాలు రాస్తూ తెలుగు సాహిత్య అభివృద్ధికి కృషి చేస్తూ,నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న యువ కవి మధును పుస్తకావిష్కరణ మహోత్సవము పలువురు అభినందించారు. తెలుగు సాహిత్య అభివృద్ధికి పాటుపడుతున్న పలువురు కవులను కూడా ఈ సందర్భంగా సన్మానించి మెమొంటో అందజేశారు. కొల్లు రమణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యం పై ఇటీవల పాఠశాల స్థాయిలో వ్యాస రచన పోటీలు నిర్వహించి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహు మతులు అందజేసారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, తెలుగు భాషోపాధ్యాయులు బాలార్జును సత్యనారాయణ మాకే, కవి పినిపే సత్యనారాయణ, తాసిల్దార్ పరమట శ్రీ పల్లవి, కాట్రేనికోన తాసిల్దార్ ఎంవి సుబ్బలక్ష్మి, ఎంపీడీవో ఎస్ వెంకటాచలం, ఎస్సై అవినాష్, ఎంఈఓ వెంకటరమణ, ఏ ఎస్ ఎం వర్మ, చింతా రాంబాబు, ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాపకులు ఆకొండి రవి, మల్లాడి శ్రీనివాస్,టి లక్ష్మీనారాయణ మూర్తి, పివివి సత్యనారాయణ, పలువురు కవులు, సాహిత్య అభిమానులు, తదితరులు పాల్గొన్నారు