Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

ఎన్టీఆర్ భరోసా పథకంలో వృద్ధులకు భర్త చనిపోయిన వితంతు మహిళ లకు, దివ్యాంగులకు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల మొదటి తేదీనే లబ్ధిదారులు ఇంటి వద్ద ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి, ఒకటవ తేదీ సెలవు రోజు వచ్చినట్లయితే దానికి ముందు రోజే ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారని ఈరోజు ఉదయం గొల్ల వీధిలో పెన్షన్ను పంపిణీ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు పాల్గొని లబ్ధిదారులు ఇంటింటికి వెళ్లి నాలుగు వేల రూపాయలు, 6000 రూపాయలు, 15000 రూపాయలు పంపిణీ చేశారని తెలుగుదేశం పార్టీ పట్టణ శాఖ ఉపాధ్యక్షులు యాదవ సంక్షేమ సంఘం నాయకులు బోడి వెంకట్రావు తెలియజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఉద్దేశించి నాగ జగదీష్ మాట్లాడుతూ పెన్షన్ లబ్ధిదారులకు ప్రతి నెల 2734 కోట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంజూరు చేసి లబ్ధిదారులకు ప్రతి నెల ఒకటవ తేదీనే అందే విధంగా ఏర్పాటు చేశారని, ఈ 16 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 48 వేల కోట్లు బడుగు బలహీనవర్గాల హరిజన గిరిజనులు కోసం కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వెనుకడుగు వేయకుండా పేదల సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తుందని నాగ జగదీష్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిత్యవసర వస్తువులపై జీఎస్టీ తగ్గించి సామాన్య మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండడంవల్ల కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు మంజూరు చేస్తున్నారని , పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు ఈ సంవత్సరంలో అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, కూటమి ప్రభుత్వం మీ అందరికీ అండగా ఉంటుందని నాగ జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పిలి జగన్, మొల్లి అప్పారావు వాయుబోయిన కోటి కొల్లూరి నూకరాజు కోన అప్పారావు కుప్పిలి నాగరాజు యం గంగరాజు తదితరులు పాల్గొన్నారు.//