తాసిల్దార్, పంచాయతీ రాజ్,పోలీస్,అధికారుల సమావేశం.
ఎమ్మార్వో భాస్కర్, ఎంపీడీవో సత్తయ్య, సీఐ వెంకటరెడ్డి,
జనం న్యూస్,అక్టోబర్ 01,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం ఎంపీడీవో సత్తయ్య ఆధ్వర్యంలో ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకై జడ్పిటిసి, ఎంపీటీసీ,సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకై, రెవిన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ సిబ్బందితో, సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ విడుదల 2025/09/29 వ తేదీ నుంచి ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున, తీసుకోవాల్సిన చర్యలను క్షుణ్ణంగా వివరించడం జరిగింది. గ్రామ పంచాయతీలో ఎన్నికల నియమావళిని అమలు బాధ్యత, పంచాయతీ కార్యదర్శిదే అని అన్నారు.పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, పోస్టర్లు,గోడల పై రాసిన రాతలు,బ్యానర్స్, రాజకీయ నాయకుల విగ్రహాలను బట్టతో కనబడకుండా మూసి ఉంచాలని అన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల నియమావళి అమలులో అలసత్వం వహించరాదని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిఓ లక్ష్మణ్,పంచాయతీ కార్యదర్శులు,పోలీస్ సిబ్బంది, గ్రామపరిపాలన అధికారులు పాల్గొన్నారు.


