తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 3
దసరా పండుగలో “శుభాకాంక్షలు” అంటే శుభం కలిగించే దుర్గామాత మరియు శ్రీరాముని ఆశీస్సులతో చెడుపై మంచి గెలిచి, అందరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, మరియు శాంతి వెల్లివిరియాలని జాగో తెలంగాణ నుండి కోరుకుంటున్నాము. ఈ పండుగ నవరాత్రులు మరియు దుర్గా పూజల ముగింపును సూచిస్తుంది, అలాగే రావణుడిపై శ్రీరాముని విజయాన్ని గుర్తుచేసుకుంటుంది.ఈ పండుగ చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయాన్ని తెలియజేస్తుంది దసరా శుభాకాంక్షలు చెప్పడం ద్వారా దైవ శక్తుల ఆశీర్వాదాలు కలుగుతాయని నమ్ముతారు.దసరా సందర్భంగా ఆనందం, శాంతి, మరియు శ్రేయస్సు కలగాలని కోరుకుంటున్నాము. జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు పి రాములనేత, ముఖ్య కార్యవర్గ ప్రధాన సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్, మాదినం శివప్రసాద్, ప్యార్ల దశరథ్, మహమ్మద్ ఫసి, అరవింద్, వడ్డె శేఖర్, విష్ణు, నగేష్,బాలకృష్ణ, గువ్వలి రమేష్, పెద్ద గోల నవీన్, బాలు ఈ పండుగను పురస్కరించుకొని తెలంగాణ మరియు జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలపడం జరిగింది


