విద్యుత్ షాక్ తో ఆపరేటర్ అశోక్ గౌడ్ మృతి,
జనం న్యూస్,అక్టోబర్ 03,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. తడ్కల్ విద్యుత్ సబ్స్టేషన్లో ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న అశోక్ గౌడ్,వయస్సు 34,విద్యుత్ షాక్ తో మృతి,గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి పోస్టుమాష్టం నిర్వహించడానికి తరలించారు. మృతునికి భార్య సౌజన్య,(26) ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు లక్కీ,(6) చిన్న కుమారుడు భూమా గౌడ్,(2) కూతురు ధనలక్ష్మి,(4) ఉన్నారు.గురువారం ట్రాన్స్ఫర్ మరమ్మత్తులకై రైతు సబ్స్టేషన్కు రాగానే ఆత్రుతలో మరమ్మత్తులు చేస్తుండగా విద్యుత్ షాక్ తో మృతి చెందారు.విద్యుత్ శాఖ అధికారులు విధులు నిర్వహిస్తూ మృతి చెందిన ఆపరేటర్ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి పిల్లల జీవనోపాధికై, ఆదుకోవాలని కుటుంబ సభ్యులు గ్రామస్తులు కోరుచున్నారు.



