శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో గురువారం దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. దసరా వేడుకల అనంతరం శ్రీ మత్స్యగిరి స్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనము లో పెట్టి డప్పు చప్పుళ్ల మధ్య గ్రామ పురవీధుల గుండా ఊరేగిస్తూ హరిజనవాడలోని జమ్మి చెట్టు వద్దకు తీసుకొని వెళ్లి జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి జమ్మి పూజను దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి నిర్వహించినారు అనంతరం జమ్మి ఆకులను కంకణాలను భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి గ్రామ పెద్దలు జిన్నా ప్రతాప్ సేనా రెడ్డి గట్ల భగవాన్ రెడ్డి మారపల్లి రవీందర్ పాడి సమ్మిరెడ్డి వంగల పరమేశ్వరి రమేష్ సాధు నాగరాజు బాసాని రాజు గిద్దమారి సురేష్ ఉప్పు రాజు మారపల్లి రమేష్ బెరుగు రాజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


