Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 3 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

యం వెంకటేశ్వర్లు పాఠశాల విద్యార్ధిని, విద్యార్థులకు దోమల నివారణకై అవగాహన కల్పించడం జరిగింది, పగటిపూట దోమలు కుట్టడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి కాబట్టి కాళ్లు చేతులు నిండుగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలన్నారు. రాత్రిపూట అందరూ దోమతెరలు వాడాలనితెలిపారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె హైమావతి మాట్లాడుతు పాఠశాల ఆవాస ప్రాంతం తరగతి గదులు మరియు ఇంటి ఇంటి పరిసరాలు ఇంటి ఆవరణలో నీరు నిలవ లేకుండా చూసుకోవాలని నిల్వ నీటిలోనే దోమల లార్వాలు వృద్ధి చెందుతాయి కావున విద్యార్థులు ఇంటిలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ఖాళీ బకెట్లు కొబ్బరి బోండాలు ఖాళీ టైర్లు ఇంటి పైన ఉండేటువంటి ఉపయోగించిన వస్తువుల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని తెలిపారు. విద్యార్థులు మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు,విద్యార్థి దశలోనే వ్యక్తి గత పరిశుభ్రత అలవర్చుకోవాలని అన్నారు. వైద్య సిబ్బంది విద్యార్థిని విద్యార్థులకు తమ సూచనలు చేశారు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లో అన్ని రకాల పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తున్నారని. వారంలో ఐదు రోజుల పాటు ఉడక బెట్టిన కొడిగ్రుడ్డు అందిస్తున్నారని అన్నారు. వారంలో మూడు రోజులు రాగిజావ మూడు రోజులు చిక్కి అందిస్తున్నారని అన్నారు.ఏ యన్ యం ధన లక్ష్మీ మాట్లాడుతూ భోజనానికి ముందు వాష్రూమ్స్ వినియోగించిన తర్వాత చేతులు పరిశుభ్రంగా సబ్బుతో శుభ్రం చేసుకోవాలని తెలిపారు చేతులు అన్ని ప్రదేశాల్లో పెడతాం కాబట్టి దుమ్ము ధూళి క్రిములు చేతిలో కట్టుకుంటాయి కాబట్టి భోజనానికి ముందు తప్పనిసరిగా సబ్బుతో చేతులు శుభ్రపరుచుకోవాలని తెలిపారు ఈ టాబ్లెట్స్ వినియోగం వల్ల కలిగేచేతులు పరిశుభ్రంగా సబ్బుతో శుభ్రం చేసుకోవాలని తెలిపారు చేతులు అన్ని ప్రదేశాల్లో పెడతాం కాబట్టి దుమ్ము ధూళి క్రిములు చేతిలో కట్టుకుంటాయి కాబట్టి భోజనానికి ముందు తప్పనిసరిగా సబ్బుతో చేతులు శుభ్రపరుచుకోవాలని తెలిపారు చేతల పరిస్థితుల వల్ల ఎన్నో ఉపయోగాలు అనేకం చేతల పరిశుభ్రం వల్ల ఎన్నోఉన్నాయి అని అన్నారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం లో మెళకువలు తెలియజేశారు. విద్యార్ధినీ విద్యార్ధులు అందరూ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే వాటినీ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు పి,శైలజ,పోటు శ్రీనివాసరావు.జి,ఆదిలక్ష్మి,కె.అరుణ సిహెచ్ నవ్య శ్రీ విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు.