

-పర్యవేక్షణ లోపంతో పడకేసిన పారిశుధ్యం
-స్థానికంగా ఉండని అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు తప్పని తిప్పలు
జనం న్యూస్ 29జనవరి భీమారం మండల రిపోర్టర్ (కాసిపేట రవి )
భీమారం మండలo పలు గ్రామపంచాయతీలో పంచాయతీలలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించే అధికారులు లేక పారిశుద్ధ్యం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే లా అస్తవ్యస్తంగా మారిందని, చెత్త సేకరణ వాహనాలు కూడా మూడు రోజులకు ఒకసారి మాత్రమే చెత్త సేకరణ చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.చెత్త కుండీల వద్ద చెత్త పేరుకుపోయి పందులు చేరతున్నాయని వాటివల్ల దుర్వాసన వెదజల్లుతుందని ,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తుంటే అధికారులు మాత్రం అవేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని, మరోపక్క పొంగిపొర్లుతున్న డ్రైనేజీ వ్యవస్థతో ప్రజలు అవస్థలు పడుతున్నారు,చెత్త పేరుకుపోయి బ్లాక్ అవుతున్నాయి, పైపులమరమ్మత్తులు చేసిన గంటకే యధావిధిగా మురుగునీరు పొంగిపొర్లుతున్న నీటి వల్ల దోమలు వ్యాప్తి చెంది విష జ్వరాలు విజృంభిస్తున్నాయని, ప్రభుత్వాలు మారినా అధికారుల తీరు మారట్లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఇప్పటికైనా సంబంధిత అధికారులు రాజకీయ నాయకులు సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.