Listen to this article

జనం న్యూస్, అక్టోబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం నిర్మాణానికి కర్కపట్ల గ్రామానికి చెందిన ఎం డి అన్వర్,పది వేల రూపాయిలు విరాళం అందజేశారు ఈ సందర్భంగా పిఎసిఎస్ వైస్ చైర్మన్ బాలరాజు, మాట్లాడుతూ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం నిర్మాణానికి కుల మతాలకు అతీతంగా విరాళం అందజేసిన ఎం డి అన్వర్ కు ధన్యవాదాలు తెలిపారు, అలాగే దేవాలయ నిర్మాణానికి ఎవరైనా దాతలు ఉంటే ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు రాళ్ల బండి బాలకృష్ణ, నర్సింలు, మధు, ఆలయ కమిటీ సభ్యులు రామస్వామి,శేఖర్,బాలచారి,వేణు,సాయి, తదితరులు పాల్గొన్నారు