Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం జనవరి 29.

తాడేవారి పల్లి. మంగళ కుంట గ్రామాలలో పొలం పిలుస్తుంది
కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారి టి. వెంకటేశ్వర్లుమాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయుచున్న ఫార్మర్ రిజిస్ట్రీ లో నమోదు కొరకు రైతులందరూ తమ వివరాలను అందజేయాలని కోరారు.ఖరీఫ్ నందు కంది పంటకు ఈ పంట నమోదు చేయించుకున్న రైతులందరూ, కందులను రైతు సేవా కేంద్రం నందు కొనుగోలు చేయుటకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకొనవలెను, అప్పుడు మాత్రమే మద్దతు ధర కన్నా బయట మార్కెట్ ధర ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రభుత్వం వారు అదే ధరకు కొనుగోలు చేయడం జరుగుతుందని తెలియజేశారు.

టమాటా పంట పరిశీలన అనంతరం ఉద్యానశాఖ అధికారి రమేష్ మాట్లాడుతూ
టమోటా పంట కోతకు ముందు, కోత తరువాత తీసుకోవాల్సిన మెలుకువలు మరియు జాగ్రత్తలు గురించి వివరిస్తూ, టమోటా కోతకు 7-10 రోజులు ముందే నీటి తడులు ఆగినట్లయితే తెగుళ్లను తగ్గించవచ్చు.
చెట్టు చుట్టూ కలుపు తీసినట్లైతే భూమి నుండి ధాతువులను మొక్క సులువుగా తీసుకొనును.
ఎండు కోమ్మలు తీసివేయుట ద్వారా శిలీంద్రజాలాల తాకిడిని తగ్గించవచ్చు.
కోతముందు
2 నుంచి 3 వారాల ముందే ఎరువులు వేయుట తగ్గించాలి.
పై విధంగా టమోటా పంటలలో చేసినట్లయితే నాణ్యత తో కూడిన అధిక దిగుబడి పొందవచ్చు అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో తాడివారిపల్లి గ్రామ సర్పంచ్ జె.జానరత్నం, ఏఈఓ దేవేంద్రగౌడ్, గ్రామ సహాయక సిబ్బంది గురవయ్య,గ్రామ పెద్దలు మరియు రైతులు పాల్గొన్నారు.