జనం న్యూస్ అక్టోబర్ 4 : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ యార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి మరియు బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగాధర్ ఆధ్వర్యంలో బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్ అప్పా షెట్కార్ గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మౌనం పాటించారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డెలికేట్ విఠల్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్, గోపాల్ రెడ్డి ,మాజీ జెడ్పిటిసి నాగనాథ్,, పుల్కల్ మాజీ సొసైటీ చైర్మన్ వెంకట్ రెడ్డి , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు అనిల్ పటేల్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు భాస్కర్ రెడ్డి బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రవి పటేల్ , శాంతాపూర్ వెంకటరెడ్డి , మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజయ్ పటేల్, సాయిని అశోక్ ,శివకుమార్ సెట్ , గోపనపల్లి శంకర్ పటేల్, సీమ గంగారాం మాజీ ఉప సర్పంచ్ నాగరాజు, గంగాధర్, మార్కెట్ కమిటీ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


