Listen to this article

జనం న్యూస్ 04 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ – గట్టు మండలం ముఖ్య నాయకుల సన్నాహక సమావేశంలో పాల్గొన్న. ఎన్ హెచ్ పి ఎస్ జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్. జోగులాంబ గద్వాల జిల్లా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరఫున పోటీచేసి సత్తా చాటాలని జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ అన్నారు. శనివారం నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో గట్టు మండల ముఖ్య నాయకులతో కలిసి ఆయన సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు, కార్యకర్తలు అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేసి విజయ ఢంకా మోగించేందుకు సత్తా చాటాలని సమితి నాయకులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉండి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకొని వారికి అండగా నిలవాలని, రాబోయే ఎన్నికల గెలుపుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, జిల్లా నాయకులు వెంకట్రాములు, గట్టు మండల అధ్యక్షుడు బలరాం నాయుడు,మండల నాయకులు దయాకర్,జమ్మన్న, వీరన్న, సురేష్ తదితరులు పాల్గొన్నారు.