మండల అధ్యక్షులు కలగూర రాజ్ కుమార్
(జనం న్యూస్ 4 అక్టోబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండల కేంద్రంలో శనివారం రోజున ప్రెస్ మీట్ నిర్వహించి, స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండి.. పార్టీ అభ్యర్ధుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చిన భీమారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కలగూర రాజ్ కుమార్, భీమారం మండలం, బిఆర్ఎస్ పార్టి కి ప్రజాధారణ ఉందని ఈ సందర్బంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ పార్టీ తరపున ఎవరినీ అభ్యర్ధిగా నియమించిన అందరూ సమిష్టిగా కృషి చేసి పార్టీ అభ్యర్ధిని గెలిపించాలని తెలిపారు.. ఈ ఎన్నికల నుంచి గ్రామా, మండల స్థాయిలో ఎటువంటి గ్రూపు, వర్గాలు లేకుండా పనిచేసి అత్యదిక సంఖ్యలో మన పార్టీ అభ్యర్ధులు విజేతలు అవ్వడానికి కష్టపడాలని, అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తిరగపడు తున్నారు కనుక వాళ్ళు గ్రామాలలో కనపడితే నిలదీసే పరిస్థితి ఉంది, ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వానికి తమ ఓటు ద్వారా బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. , కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల చేసిన విషయం తెలిసిందే కాబట్టి ఇట్టి కార్డును గ్రామములో అందరికి అందించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు మాజీ ఎంపీటీసీలు కార్యకర్తలు సీనియర్ నాయకులు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు


