Listen to this article

టీఆర్ఎస్‌ ఉద్యమ సైనికుడు, నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక నాయకుడు — ఇప్పుడు జాగృతి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు

జనం న్యూస్ కరీంనగర్, అక్టోబర్ 4 ( ప్రతినిధి): తెలంగాణ ఉద్యమ వీరుడు, టీఆర్ఎస్ పార్టీకి నిబద్ధతతో సేవలందిస్తున్న ప్రముఖ నాయకుడు గుంజపడుగు హరిప్రసాద్ తాజాగా తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ నియామక పత్రాన్ని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు స్వయంగా అందజేశారు. హరిప్రసాద్ మాట్లాడుతూ, “బీసీ సమాజానికి రాజకీయాధికారాన్ని అందించాలన్న కల్వకుంట్ల కవిత స్ఫూర్తితోనే జాగృతిలో చేరాను. తెలంగాణ జాగృతి వేదిక ద్వారా బీసీల చైతన్యానికి, తెలంగాణ సాంస్కృతిక గౌరవానికి కృషి చేస్తాను” అన్నారు తెలంగాణ ఉద్యమ సైనికుడిగా పునాది 2009 డిసెంబర్ 29న తెలంగాణ భవన్ హైదరాబాదులో కేసీఆర్ సాక్షిగా ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరిన హరిప్రసాద్ , తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక రాస్తారోకోలు, బంద్‌లు, రైల్ రోకోలు, నిరాహార దీక్షలు, ధర్నాల్లో పాల్గొని ఉద్యమ సైనికుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈటల రాజేందర్, కెప్టెన్ లక్ష్మికాంతారావు, ఈద శంకర్‌రెడ్డి, సర్దార్ రవీందర్ సింగ్, నారదాసు లక్ష్మణరావు వంటి నాయకుల మార్గదర్శకత్వంలో పనిచేసి, కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషించారు. మీడియా సెల్‌ నుండి నాయకత్వ స్థాయికి టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా మీడియా సెల్ ఇంచార్జ్, అనంతరం జిల్లా అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, పార్టీ కార్యక్రమాలు మరియు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేర్చడంలో ముందున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా పార్టీ ఆలోచనలను ప్రజలకు చేరవేస్తున్నారు. నాయీబ్రాహ్మణ సమాజానికి అంకిత సేవలు నాయీబ్రాహ్మణ కులానికి చెందిన హరిప్రసాద్ , కరీంనగర్ నాయీబ్రాహ్మణ సేవా సంఘం నగర ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా, జేఎసి జిల్లా అధ్యక్షుడిగా, నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా కీలక సేవలు అందించారు.తెలంగాణ స్థాయిలో వివిధ నాయీబ్రాహ్మణ సంఘాలను ఏకం చేస్తూ “తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక”ను స్థాపించి, ప్రస్తుతం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బీసీ హక్కుల సాధనలో చురుకైన పాత్ర బీసీ వర్గాల సమస్యల పరిష్కారానికి గుంజపడుగు హరిప్రసాద్ అనేక బీసీ ఉద్యమాలను చేపట్టారు. ఆయన మాట్లాడుతూ “బీసీల రాజకీయాధికారాన్ని సాధించాలన్న కల్వకుంట్ల కవిత గారి సంకల్పం నాకు స్ఫూర్తి. జాగృతి వేదిక ద్వారా బీసీల చైతన్యాన్ని, తెలంగాణ సంస్కృతిని బలోపేతం చేస్తాను” అన్నారు. తెలంగాణ జాగృతితో కొత్త ఉత్సాహం జాగృతి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన హరిప్రసాద్ తెలంగాణ సంస్కృతి, భాష, జాతి గౌరవాన్ని ప్రజల్లో నాటే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.“జాగృతి ద్వారా తెలంగాణ యువతలో ఉద్యమ ఆత్మను, బీసీలలో స్వాభిమానాన్ని నింపడం నా ప్రధాన ధ్యేయం” అని ఆయన తెలిపారు.