

జనం న్యూస్ అక్టోబర్(4) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సర్కిల్ పరిధిలో ఉన్న 17 మద్యం దుకాణాలకు శనివారం నాడు రెండు దరఖాస్తులు వచ్చినవి అని తుంగతుర్తి సర్కిల్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రజిత తెలిపారు. ప్రభుత్వం 2025-2027 రెండు సంవత్సరాల గాను సెప్టెంబర్ నెల 26వ తారీఖు నుండి అక్టోబర్ 18 వ తారీకు వరకు ఒక్కొక్క దరఖాస్తుకు 3 లక్షల రూపాయలు నిర్వహించి మద్యం షాపుల దరఖాస్తుకు గెజిట్ విడుదల చేయగా శనివారం నాడు రెండు దరఖాస్తులు అందినవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మూర్తి మరియు సిబ్బంది పాల్గొన్నారు.