

జనం న్యూస్, అక్టోబర్ 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జగదేవపూర్ : వారంతా చిన్ననాటి స్నేహితులు కలిసిమెలిసి ఆటలాడుకుంటూ చదువుకున్నారు పెరిగి పెద్దయి ఎవరికి వారు జీవితాల్లో స్థిరపడ్డారు. ఇంతలో తమతో చదివిన చిన్ననాటి స్నేహితురాలు వాళ్ల అమ్మ అనారోగ్యంతో మృతి చెందారు ,విషయం తెలిసి చలించిపోయారు ఎలాగైనా స్నేహితురాలు కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించుకొని బృందంగా ఏర్పడి చేయి చేయి కలిపి చేతనైనంత సాయాన్ని చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు బాధిత కుటుంబానికి అందజేశారు. వివరాల్లోకి వెళ్తే మండల పరిధిలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన గోలి నర్సమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు, 2007 – 2008 బ్యాచ్ కు చెందిన బాల్య మిత్రులంతా కలిసి ఆర్థిక పరిస్థితి తెలుసుకొని ఆ కుటుంబానికి సాయం చేయాలనే సంకల్పంతో 50 కిలోల సన్న బియ్యం,నిత్య అవసర సరుకులు స్నేహితురాలు లావణ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లావణ్య కుటుంబానికి ఏప్పుడు అండగా ఉంటామని చెప్పారు, తమలో తమకే కాదు మా తోటి మిత్రుల కుటుంబంలో ఎవరికి కష్టం వచ్చినా అందరం కలిసి ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.