జనం న్యూస్ అక్టోబర్ ఐదు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన, :
గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని అమలా పురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి అన్నారు. మండల పరిధిలో చెయ్యేరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ చెల్లి సురేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వివిధ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చెయ్యాలని సర్పంచ్ చెల్లి సురేష్ విన్నవి ంచారు, ప్రభుత్వం విప్, ముమ్మిడివరం ఎమ్మె ల్యే దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ మూడు. కోట్ల యాభై లక్షల రూపాయలు నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు, ఇంటింటా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలో బాగంగా దశల వారీగా నెరవేరుస్తున్నా మన్నారు. గత ప్రభుత్వం తప్పిదల వల్ల గ్రామాల పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేక అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందన్నారు. ఈ సందర్భంగా ముమ్మిడి వరం శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు చెయ్యేరు పర్యటనలో భాగంగా వివిధ సమస్యలపై హామీలు ఇచ్చా రన్నారు. అందులో భాగంగా శనివారం సుమారు 32 సీసీ రహదారులకు ఏకకా లంలో శంకుస్థాపనలు చేసుకుంటు న్నామ న్నారు, అభివృద్ధి పనులకు సుమారు 3 కోట్ల 56 లక్షల రూపాయల వ్యయం అవుతుందని ఎమ్మెల్యే బుచ్చిబాబు తెలిపారు. అభివృద్ధి పనులకు ఒకే సారి అనుమతులు ఇచ్చినా ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేశారు. ముందుగా దాసులమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వ హించారు. చెయ్యేరు పంచాయతీలో భారత రాజ్యాంగ నిర్మాత అంబే ద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు త్సవటపల్లి నాగు, ఆకాశం శ్రీనివాస్, నడింపల్లి సుబ్బరాజు, గొలకోటి దొరబాబు, నాగిడి నాగేశ్వర రావు, గుత్తుల సూర్య మహాలక్ష్మి, కాండ్రేకుల బా లాజీ,వెంట్రు సుధీర్,ఇసుకపట్ల వెంక టేశ్వర రావు మోకా బాల ప్రసాద్, ఎంపిడిఓ ఎస్ వెంకట చలం, కూటమి సీనియర్ నేతలు కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, వార్డు సభ్యుల,పలు శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.



