Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 6 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

గ్రీన్ క్లబ్ అనకాపల్లి ఆధ్వర్యంలో కొత్తూరు సత్యనారాయణ దేవస్థానం కొండపై నుండి విత్తనబంతులు విసిరే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా అటవీశాఖ అధికారి శ్రీ ఎన్ సోమసుందరం దేవస్థానం చైర్మన్ అప్పికొండ గణేష్ విశ్రాంతి అటవీశాఖ అధికారి బి జానకి రామ్ పాల్గొని 5000 విత్తన బంతులను కొండ చుట్టూ విసిరి పర్యావరణాన్ని కాపాడడానికి ఈ ప్రక్రియ దోహదం చేస్తుందని గ్రీన్ క్లబ్ అధ్యక్షులు కొణతాల పణి భూషణ్ శ్రీధర్ అన్నారు. పచ్చదనాన్ని పెంచడానికి విత్తనబంతులు చాలా ప్రభావంతమైన పద్ధతిని కొండప్రాంతాల్లో పచ్చదనం పెంచడానికి విత్తన బంతులు బాగా ఉపయోగపడతాయని, విత్తనాలు భూమిపై నాటడం కంటే ఈ విత్తనబంతులు విత్తనాలకు పక్షుల నుండి కీటకాల నుండి రక్షణ అందిస్తాయని, విత్తనబంతుల తయారు చేయడం ఒక ఆహ్లాదకర పని అని, పిల్లలకు పర్యావరణం గురించి నేర్పడానికి మంచి అవకాశం అని అనకాపల్లి జిల్లా డీఎఫ్ఓ సోమసుందర్ అన్నారు. ఈ విత్తన బంతులు విసరడానికి గ్రీన్ క్లబ్ సభ్యులు సుమారు 60 మంది వయసు తారత్వమ్యం లేకుండా అందరూ కొండెక్కి విత్తనబంతులు విసిరారు. ఈ కార్యక్రమంలో కాండ్రేగుల సత్యనారాయణ యలమంచిలి బంగార్రాజు బేతాళం శేషసాయి వంకాయల ఈశ్వరరావు గ్రీన్ క్లబ్ మహిళా విభాగ నాయకురాలు అనిత అధిక సంఖ్యలో గ్రీన్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.