

కండక్టర్ డ్రైవర్ అప్రమత్తంతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు
జనం న్యూస్ జనవరి 30 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్
సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామ శివారులో బుధవారం ఆర్టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెల్లారేగడంతో అప్రమత్తమైన కండక్టర్,డ్రైవర్ బస్సులో ఉన్న స్కూలు విద్యార్థులను ప్రయాణికులను సురక్షితంగా బస్సులో నుంచి బయటకి పంపించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని కండక్టర్ డ్రైవర్ తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామ పంచాయతి కార్యదర్శి అనిత, మాజీ సర్పంచ్ భీష్మారావు గ్రామపంచాయతీ ట్రాక్టర్ సహాయంతో విద్యార్థులను పాఠశాలకు పంపించారు.