తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్
బీసీలకు 42% శాతం రిజర్వేషన్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు…చీకట్లో గొంగడి కప్పుకొని చాటుoగా రిజర్వేషన్ ఇవ్వొచ్చా లేదా అని చూస్తుంది…మాకు హక్కుగా రావాల్సిన రిజర్వేషన్ రావాల్సిందే…దీన్ని కచ్చితంగా అడ్డుకోవాలని హై కోర్టులో,సుప్రీంకోర్టులో కేసు వేశారు పిటిషన్ వెనక్కు తీసుకోవాలని బీసీ సమాజం తరుపున వారికి రిక్వెస్ట్ చేసాము…అయినా కూడా మేము పిటిషన్ వాపస్ తీసుకోకుండా ఇలాగే మొండికేస్తాం అంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త ఉద్యమం పుడుతుంది,తిరుగుబాటుగా మారుతుంది…తరువాత జరిగే పరిణామాలన్నిటికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది రెడ్డి ముఖ్యమంత్రి GO ఇస్తడు, రెడ్డి మనిషి పిటిషన్ వేస్తడు,రెడ్డి ప్లీడర్ కేసు వాదిస్తడు…మా బీసీలను పిచ్చోళ్లను చేస్తూ హైకోర్టు,సుప్రీం కోర్టు చుట్టూ చూసేలా చేసి మమ్మల్ని మోసగించేలా చేస్తున్నారు…బీసీలకు 42% శాతం రిజర్వేషన్ రాకుండా పోతే దానికి పూర్తి బాధ్యత వహిస్తూ బేషరతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల్సిందే డిల్లీ వేదికగా TRP రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడారు….మల్లన్న గారితో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ మరియు టీఆర్పి నాయకులు శ్రీశైలం గారు పాల్గొన్నారు


