Listen to this article

విలేకరి ఆత్మహత్యాయత్నానికి కారణమైన సీపీఐ జిల్లా కార్యదర్శి పై కేసు నమోదు చేయాలి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి

జనం న్యూస్ 07అక్టోబర్( కొత్తగూడెం నియోజకవర్గం)

కొత్తగూడెం పత్రిక విలేకరిగా పనిచేస్తున్న చదలవాడ సూరి ఆత్మహత్యయత్నంకు కారకులైన సిపిఐ జిల్లా కార్యదర్శిపై వెంటనే కేసు నమోదు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు.సోమవారం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ చదలవాడ సూరి ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రికి వెళ్లి అడిగి తెలుసుకున్నారు.ప్రజాస్వామ్యంలో పత్రిక జర్నలిస్టుల స్వేచ్ఛను,అనగతొక్కాలని చూస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.సిపిఐ జిల్లా కార్యదర్శిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయకపోవడం బాధాకరమన్నారు.ఇప్పటికైనా ఒక జర్నలిస్టు ఆత్మహత్యయత్నానికి కారకుడైన సిపిఐ జిల్లా నాయకుడిపై పోలీసులు వెంటనే చట్టపరంగా కేసులు నమోదు చేయాలని కోరారు.ఈవిషయంపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో చుంచుపల్లి,లక్ష్మీదేవిపల్లి మండలాల అధ్యక్షులు బలగం శ్రీధర్,మాలోత్ గాంధీ,గొడుగు శ్రీదర్ మాడ కృష్ణారెడ్డి టౌన్ జనరల్ సెక్రెటరీ ఆగుళ్ల వీరేశలింగం వెంకన్నతదితరులు పాల్గొన్నారు