జనం న్యూస్ అక్టోబర్ 6 నడిగూడెం
మండల వ్యవసాయ అధికారిగా గోలి మల్సూర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నల్లగొండ జీల్లా వేములపల్లి మండలంలో ఏఈఓ గా పని చేస్తున్న మల్సూర్ పదోన్నతి పొంది నడిగూడెం ఏవోగా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా సిబ్బంది నూతన ఏవోను అభినందించారు. అభినందించిన వారిలో ఏఈవోలు పిచ్చయ్య,ఉప్పయ్య, రేణుక పాల్గొన్నారు.


