జనం న్యూస్ అక్టోబర్ 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు కాకినాడలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు .
ఈ సమావేశం శాసనసభ్యులు వారు మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించడంలో సమస్యలు ఉన్నాయని గత ప్రభుత్వ హయాంలో పూడికతీతలు నిర్లక్ష్యం చేసిన కారణంగా క్రింద ప్రాంతాలకు నీరు సరఫరా చేయడంలో ఇబ్బందులు ఉన్నాయని వాటిని అధికమించడానికి అధికారులు ప్రణాళికలు తయారు చేసుకోవాలని ఇంజరంలో బ్రిడ్జ్ కు త్వరలో శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలియజేశారు.
ఈ సమావేశంలో కాకినాడ జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.



