విద్యను అభ్యసించడానికి తమ కష్టాన్ని,ఇష్టంగా మార్చి,ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన వీర వనితలు,
ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన అక్క అర్చన,చెల్లెలు అమూల్య,
జనం న్యూస్,అక్టోబర్ 07,కంగ్టి
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని చందర్ నాయక్ తండా కు చెందిన రుక్మిణి బాయి పుసింగ్ నాయక్, దంపతులు బీద కుటుంబానికి చెందినవరు.జీవన ఉపాధికై అతి కష్టతరమైన జీవితాన్ని, వైద్య ఆరోగ్యశాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ తమ కుటుంబాన్ని పోషిస్తూ,తమ పిల్లలకు ఉన్నతమైన విద్యను అభ్యసించాలన్న దృఢ సంకల్పంతో తరచుగా తమ కుమార్తెలను విద్యను అభ్యాసించాలని అంటూ ఉండేవారు. ఫుల్ సింగ్ నాయక్, ఇద్దరు కుమార్తెలు అర్చన,అమూల్య, సంగారెడ్డి జిల్లా లోని సిర్గాపూర్ మండలంలోని మారుమూల చెందర్ నాయక్ తండాకు చెందిన వారు.ఈ తాండాకు రాకపోకలకై దారి లేనటువంటి సమయంలో విద్యను అభ్యసించడానికి కష్టానికి ఇష్టంగా, ఇరువురు ఉన్నతమైన విద్యను అభ్యసించి మట్టిలో మాణిక్యంల ఎంబీబీఎస్ లో ఉత్తీర్ణులయ్యారు. అర్చన,1వ తరగతి నుంచి 2వ తరగతి బ్రిలియంట్ స్కూల్ నారాయణఖేడ్,3వ తరగతి నుంచి 10వ తరగతి క్లాస్ బెస్ట్ గౌట్ సీట్.ఎస్టి జోసాప్. సంగారెడ్డి,ఇంటర్ శ్రీ చైతనయ్య,రుద్రారం బ్రాంచ్ 10త్ మర్క్స్ 9.8%,ఇంటర్ మర్క్స్ 979%,నీట్ యూజీ 384%, ఎంబీబీఎస్ గవర్నమెంట్ కన్వీనర్ కోట సీట్ అరుంధతి మెడికల్ కాలేజీ దుండిగల్ హైదరాబాద్,లో ఉత్తీర్ణత సాధించారు. అమూల్య,1వ తరగతి నుంచి 4వ తరగతి బ్రిలియంట్ స్కూల్ నారాయణఖేడ్,5వ తరగతి నుంచి 10వ తరగతి రెసిడెన్షియల్ స్కూల్ హోతి కె,జహీరాబాద్,10త్ మార్క్స్ 9.5%,ఇంటర్ మర్క్స్ 989%,నీట్ యూజీ మర్క్స్ 428%,అల్ ఇండియా ర్యాంక్ 158012 ఎంబీబీఎస్ గవర్నమెంట్ కన్వీనర్ కోట సీట్ గోట్ మెడికల్ కాలేజీ సూర్యాపేట,లో ఉత్తీర్ణత సాధించారు.ఈ సందర్భంగా తాండవాసులు, బంధుమిత్రులు,వారిని అభినందిస్తున్నారు.


