Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 9 నడిగూడెం

సోషల్ మీడియా వేదికగా తప్పుడు పోస్టులు పెడుతూ అసత్య ప్రచారాలు, వ్యక్తిగత దూషణలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, కేసులు నమోదు చేస్తామని నడిగూడెం ఎస్సై జి. అజయ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పోస్టులను, ఫోటోలు, వీడియోలను, వాట్సాప్ స్టేటస్ ద్వారా ఇతరులను కించపరిచిన, ఇతరుల వ్యాఖ్యలను షేర్ చేసే ముందు పరిశీలన చేయాలని అన్నారు. అది నిజమో కాదో నిర్ధారణ చేసుకోవాలని, వివాదాస్పదమైన పోస్టులకు దూరంగా ఉండాలని గ్రూప్ అడ్మిన్ కుడా పోస్ట్స్ పరిశీలన చేయాలని సూచించారు. అందరు కూడా గ్రామలలో స్నేహపూరిత వాతావరణం కలిగి ఉండాలన్నారు. సోషల్ మీడియాని పోలీస్ శాఖ ప్రతిరోజు పరిశీలిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పోస్ట్ చేసే ముందు ఆలోచించి పోస్ట్ చేయాలని, లేనియెడల వారిపైన, గ్రూప్ అడ్మిన్ ల పైన కే