Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 9 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

అల్లవరం మండలం ప్రభుత్వ వైద్యశాల వద్ద జన ఔషధములపై జిఎస్టి తగ్గించడం పట్ల జిఎస్టి మీటింగ్ ఏర్పాటు చేసిన గవర్నమెంట్ హాస్పటల్ సూపర్నెంట్ ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు యాళ్ల దొరబాబు ఎంపీపీ ఇళ్ల శేషారావు యాళ్ల దొరబాబు మాట్లాడుతూ జిఎస్టి తగ్గించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ధన్యవాదాలు తెలుపుతూ పేద ప్రజలకు మందులపై తగ్గించిన జీఎస్టీ వల్ల ఎంతో మేలు జరుగుతుందని ఇకపై ఆరోగ్య సంరక్షణ సులభతరం అని సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం అని ఆయన అన్నారు అనేక రకములైన వస్తువులపై జిఎస్టి తగ్గించడం జరిగిందని ఈ జీఎస్టీ తగ్గించడం వలన ప్రజలపై భారం తగ్గటమే కాకుండా వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే విధంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు అలాగే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ కి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ముత్యాల రామకృష్ణ హాస్పిటల్ సిబ్బంది మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు